World environment day: పర్యావరణ దినోత్సవం.. సెలబ్రిటీలతో వంతారా క్యాంపెయిన్‌

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వంతారా సరికొత్త క్యాంపెయిన్‌ ప్రారంభించింది. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రోత్సహించేలా ‘ఐయామ్‌ వంతారియన్‌’ పేరిట ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపట్టింది.

Published : 05 Jun 2024 14:28 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముకేశ్‌ అంబానీ వారసుడు అనంత్‌ అంబానీ కలల ప్రాజెక్ట్‌ వంతారా సరికొత్త క్యాంపెయిన్‌ ప్రారంభించింది. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రోత్సహించేలా ‘ఐయామ్‌ వంతారియన్‌’ పేరిట ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా సినీ, క్రికెట్ ప్రముఖులతో కూడిన ప్రత్యేక వీడియోను బుధవారం విడుదల చేసింది.

బాలీవుడ్‌ సినీ నటులైన అజయ్‌ దేవగణ్‌, జాన్వీ కపూర్‌, భూమి పెడ్నేకర్‌, వరుణ్‌ శర్మతో పాటు క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, ఇన్‌ప్లూయెన్సర్‌ కుషా కపిలా ఈ వీడియోలో కనిపించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తమ ప్రయత్నం చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. తమను తాము వంతారియన్స్‌గా పరిచయం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియజేస్తూ ఇందులో పాలుపంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. #ImAVantarian హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ఈ క్యాంపెయిన్‌కు నెట్టింట ఆదరణ లభిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు