RBI: ప్రభుత్వ బాండ్ల లావాదేవీలకు యాప్‌ ఆవిష్కరించిన ఆర్‌బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం మూడు ప్రధాన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల (జి-సెక్‌) మార్కెట్లో రిటైల్‌ మదుపర్లు పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ ఒక మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది.

Published : 29 May 2024 03:19 IST

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం మూడు ప్రధాన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల (జి-సెక్‌) మార్కెట్లో రిటైల్‌ మదుపర్లు పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ ఒక మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని రిటైల్‌ మదుపర్లు జి-సెక్‌ లావాదేవీలు చేయొచ్చు. ఇప్పటివరకు రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ ఖాతాలను మదుపర్లు రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా తెరవాల్సి వస్తోంది. 

ప్రవాహ్‌ పోర్టల్‌: ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ నియంత్రణ పరమైన అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం కోసం ‘ప్రవాహ్‌’ అనే పోర్టల్‌ను ఆర్‌బీఐ తీసుకొచ్చింది. అనుమతులు, ఆమోదాల ప్రక్రియలో వేగం, సామర్థ్యం ఈ పోర్టల్‌తో మరింత పెరుగుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. వేర్వేరు నియంత్రణ, పర్యవేక్షణ విభాగాలకు చెందిన 60 రకాల దరఖాస్తు ఫారాలను ఆన్‌లైన్‌లోనే ఈ పోర్టల్‌ ద్వారా సమర్పించవచ్చు. వారి దరఖాస్తులను ట్రాక్‌ చేసుకునే వీలూ ఉంటుంది. 

ఫిన్‌టెక్‌ రిపాజిటరీ: ఫిన్‌టెక్‌ రిపాజిటరీని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆవిష్కరించారు. ఇది భారత ఫిన్‌టెక్‌ కంపెనీల సమాచారానికి ఒక డేటా స్టోర్‌హౌస్‌లా ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు