Apple: రానున్న మూడేళ్లలో యాపిల్‌ నుంచి 5 లక్షల ఉద్యోగాలు!

Apple: రానున్న మూడేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు చేపట్టే యోచనలో టెక్‌ సంస్థ యాపిల్‌ ఉన్నట్లు ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి పీటీఐ వార్తా సంస్థతో తెలిపారు.

Published : 21 Apr 2024 22:50 IST

Apple | దిల్లీ: ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ (Apple) భారత్‌లో తన శ్రామిక శక్తిని గణనీయంగా పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనుందని ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి పీటీఐ వార్తా సంస్థతో తెలిపారు. దీంతో రానున్న మూడేళ్లలో ఏకంగా 5 లక్షల మంది ఉపాధి పొందనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు యాపిల్‌ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. దేశీయంగా చేపడుతున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని చూస్తోంది. రానున్న 4-5 ఏళ్లలో ఉత్పత్తి ఐదు రెట్లు పెంచి సుమారు 40 బిలియన్‌ డాలర్ల (సుమారు 3.32లక్షల కోట్లు)కు చేర్చాలని యోచిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో యాపిల్‌ విక్రయదారులు, సరఫరాదారులు మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వ్యాపార విస్తరణతో భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుంది. 

ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం తెలియదా? డెలాయిట్‌ హెచ్‌ఆర్‌ టిప్స్‌ ఇవే..

మరోవైపు.. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతోన్న శాంసంగ్‌ (Samsung) కంపెనీను యాపిల్‌ తొలిసారి వెనక్కి నెట్టింది. దశాబ్దానికి పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న శాంసంగ్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్‌ఫోన్లు సరఫరా చేసిన కంపెనీగా తొలిసారి మొదటి స్థానంలో నిలిచింది. ఆపిల్‌ షిప్‌మెంట్‌లో 10 మిలియన్‌ యూనిట్ల మార్కును అధిగమించిందని తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే యాపిల్‌ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. 2022-23లో 6.27 బిలియన్లగా ఉన్న ఉత్పత్తులు 2023-24 నాటికి 12.1 బిలియన్లకు పెరిగాయి. అంటే ఉత్పత్తుల్లో దాదాపు 100శాతం వృద్ధి నమోదు చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని