ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం తెలియదా? డెలాయిట్‌ హెచ్‌ఆర్‌ టిప్స్‌ ఇవే..

తెలియని విషయం గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్పాలోనని చాలా మంది తెగ గాబరా పడుతుంటారు. అలాంటి వారి కోసమే డెలాయిట్‌ హెచ్‌ఆర్‌ మూడు చిట్కాలు తెలిపారు. అవేంటంటే?

Published : 22 Apr 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటర్వ్యూ అంటేనే చాలా మందికి భయం. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని ఆందోళన చెందుతుంటారు. తెలియనివాటికి ఎలా సమాధానం చెప్పాలోనని గాబరా పడిపోతుంటారు. అయితే ముఖాముఖిలో అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియకపోవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని టిప్స్‌ పాటిస్తే చాలు అంటున్నారు ప్రముఖ హెచ్‌ఆర్‌ థెరిసా ఫ్రీమాన్‌. ఆమెకు డెలాయిట్‌, అమెజాన్‌లలో విధులు నిర్వహించిన అనుభవం ఉంది. ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఇంటర్వ్యూ అభ్యర్థులు పాటించాల్సిన మూడు టిప్స్‌ చెప్పారు. 

‘హర్మోజ్‌’ను ఇరాన్‌ అడ్డుకుంటే.. ఆయిల్‌ ధరలకు రెక్కలే!

  • ఇంటర్వ్యూ సమయంలో ఏదైనా ప్రశ్న అర్థం కాకపోతే మళ్లీ అడగమని విజ్ఞప్తి చేయాలి. లేదా.. మరో విధంగా అడగమని అభ్యర్థించాలి. కొన్నిసార్లు ప్రశ్న సరిగా వినిపించకపోయినా, విభిన్న రీతిలో అడిగినా.. ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. అందుకే ప్రశ్నను రీఫ్రేమ్‌ చేయమని కోరడం ముఖ్యం.
  • కొన్ని సందర్భాల్లో రీఫ్రేమ్‌ చేసిన తర్వాత కూడా సంబంధిత అంశం గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు. అలాంటి సమయంలో సమాధానం చెప్పడం ఇబ్బందే. ఇటువంటి సందర్భంలో మీకు ఏ అంశంపై పట్టు ఉందో దానికి సంబంధించిన విషయాలు మాట్లాడి.. ఇంటర్వ్యూయర్‌ని ఆ టాపిక్‌పై ప్రశ్నలడిగేలా మళ్లించేందుకు ప్రయత్నించండి.  
  • ఇంటర్వ్యూయర్‌ అడిగే అంశంపై అనుభవం లేకపోతే.. వాటిని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామనే ఆసక్తి కనిపించేలా సమాధానం చెప్పాలి. ‘‘ఈ ఉద్యోగంలో మీరు చెప్పిన నైపుణ్యాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని భావిస్తున్నాను. నేను ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటాను’’ అని సమాధానం చెప్పాలని ఫ్రీమాన్‌ తెలిపారు. కొత్త విషయం నేర్చుకోగలమని నమ్మకం కలిగించిన వారే సరైన అభ్యర్థులని భావిస్తారన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని