Audi: ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?

Audi: భారత్‌లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది.

Updated : 25 Apr 2024 12:34 IST

దిల్లీ: జర్మనీకి చెందిన వాహన తయారీ సంస్థ ఆడి కార్ల ధరలను పెంచనుంది. భారత్‌లో విక్రయిస్తున్న అన్నిరకాల మోడళ్లపై జూన్‌ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన రవాణా ఛార్జీలతో పాటు నిర్వహణ వ్యయాలను సర్దుబాటు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ గురువారం తెలిపింది.

కారు మోడల్‌ను బట్టి ధరను గరిష్ఠంగా రెండు శాతం వరకు పెంచనున్నట్లు ‘ఆడి ఇండియా’ పేర్కొంది. తద్వారా కంపెనీ వ్యాపార వృద్ధితో పాటు డీలర్లకూ ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడింది. 2023-24లో ఈ కంపెనీ భారత్‌లో 7,027 యూనిట్లను విక్రయించింది. వార్షికంగా 33 శాతం వృద్ధి నమోదు చేసింది. భారత్‌లో ఆడి ఏ4, క్యూ3, క్యూ5, ఆర్‌ఎస్‌ క్యూ8 వంటి ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని