Avtar Saini: ఇంటెల్‌ ఇండియా మాజీ చీఫ్‌ అవతార్‌ సైనీ కన్నుమూత

Avtar Saini: క్యాబ్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇంటెల్‌ ఇండియా మాజీ చీఫ్‌ అవతార్‌ సైనీ కన్నుమూశారు.

Published : 29 Feb 2024 11:23 IST

ముంబయి: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్‌ ఇండియా మాజీ చీఫ్‌ అవతార్‌ సైనీ (Avtar Saini) (68) గురువారం ఉదయం కన్నుమూశారు. నవీ ముంబయి టౌన్‌షిప్‌లో సైక్లింగ్‌ చేస్తున్న సమయంలో ఓ క్యాబ్‌ వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్యాబ్‌ డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సైనీ (Avtar Saini) ఇంటెల్‌ 386, 486 మైక్రోప్రాసెసర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పెంటియం ప్రాసెసర్‌ డిజైన్‌ బృందానికి నేతృత్వం వహించారు. ఇంటెల్‌ దక్షిణాసియా విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన సతీమణి మూడేళ్ల క్రితమే చనిపోయారు. కుమార్తె, కుమారుడు అమెరికాలో నివాసముంటున్నారు.

సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన ఓ విజయవంతమైన ఆవిష్కర్తగా, అత్యుత్తమ నాయకుడిగా, విలువైన మెంటార్‌గా గుర్తుండిపోతారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు