FD Rates: వడ్డీ రేట్లను సవరించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 5-20 బీపీఎస్ వరకు తగ్గించింది.
దిల్లీ: ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ తన ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 5-20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 7-14 రోజుల ఎఫ్‌డీపై సాధారణ డిపాజిటర్లకు 3.50% కనిష్ఠ వడ్డీని, 13 నెలలు ఆపై కాలవ్యవధులకు 7.10% గరిష్ఠ వడ్డీని అందిస్తుంది. ఇదే కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లు కనిష్ఠంగా 3.50% నుంచి గరిష్ఠంగా 7.85% మధ్య వడ్డీ రేట్లను పొందొచ్చు.
ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం 4 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై బ్యాంకు 5 బీపీఎస్ తగ్గించింది. ఇప్పుడు ఈ కాలవ్యవధి డిపాజిట్లపై 6.75% వడ్డీని అందిస్తుంది. ఒక సంవత్సరం 5 రోజుల నుంచి 13 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు ఇంతకు ముందు 7.10% ఉండేది. ఇప్పుడు 20 బీపీఎస్ తగ్గింపుతో 6.80% అందిస్తోంది. 13 నెలల నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై, బ్యాంకు మునుపటి 7.15% నుంచి 7.10% ఆఫర్ చేస్తోంది. 2 సంవత్సరాల నుంచి 30 నెలల లోపు కాలవ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు 7.20% నుంచి 7.05%కు బ్యాంకు తగ్గించింది. తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 2023, మే 18 నుంచి అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virender Sehwag: చివరి నిమిషంలో ఛాన్స్ పోయింది..: అరంగేట్రంపై సెహ్వాగ్
-
Politics News
Rahul Gandhi: కారు అద్దంలో చూస్తూ.. మోదీ డ్రైవింగ్ చేస్తున్నారు..!
-
India News
Wrestlers Protest: చట్టం అందరికీ సమానమే.. రెజ్లర్లతో భేటీలో అమిత్ షా
-
Sports News
Jadeja Or Ashwin: జడేజా లేదా అశ్విన్.. గావస్కర్ ఛాయిస్ ఎవరంటే..!
-
Crime News
Girl Suicide: కాబోయే వాడు మోసం చేశాడంటూ.. యువతి ఆత్మహత్య
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!