Elon Musk: యూట్యూబ్‌కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్‌’ టీవీ యాప్‌!

వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘ఎక్స్‌’ సిద్ధమవుతోంది.

Published : 24 Apr 2024 14:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube)కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు సిద్ధమయ్యారు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. ఎక్స్‌ టీవీ యాప్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ కూడా యూట్యూబ్‌ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

‘చిన్న తెర నుంచి పెద్ద తెర వరకు.. ఎక్స్‌ అన్నింటినీ మార్చేస్తోంది. ఎక్స్‌ టీవీ యాప్‌తో నూతన, ఆకర్షణీయమైన కంటెంట్‌ను మీ స్మార్ట్‌ టీవీల్లోకి త్వరలో తీసుకురానున్నాం. పెద్ద స్క్రీన్‌లపై అత్యంత నాణ్యమైన కంటెంట్‌, అందులో లీనమయ్యే అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఇది రూపుదిద్దుకుంటోంది’ అని ఎక్స్‌ సీఈవో లిండా యాకరినో తన సోషల్‌మీడియా ఖాతాలో పేర్కొన్నారు. టీవీ యాప్‌ విశేషాలతోపాటు, ఇంటర్‌ఫేస్‌ ఎలా ఉండనుందనే విషయానికి సంబంధించి ఓ చిన్న వీడియోను ఆమె పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని