BCAS: బ్యాగేజీ డెలివరీ 30 నిమిషాల్లోపే

దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ వంటి 6 ప్రధాన విమానాశ్రయాల్లో గత 4 నెలల్లోనే బ్యాగేజీ డెలివరీ సమయం మెరుగైంది.

Published : 26 May 2024 02:58 IST

హైదరాబాద్‌ సహా 6 ప్రధాన విమానాశ్రాయాల్లో
పౌర విమానయాన శాఖ చర్యల వల్లే

దిల్లీ: దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ వంటి 6 ప్రధాన విమానాశ్రయాల్లో గత 4 నెలల్లోనే బ్యాగేజీ డెలివరీ సమయం మెరుగైంది. ఈ విమానాశ్రయాల్లో 90 శాతానికి పైగా ప్రయాణికులకు విమానం ల్యాండింగ్‌ అయిన 30 నిమిషాల్లోపే బ్యాగేజీని అందించారని పౌర విమానయాన శాఖ తెలిపింది. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయ ఆపరేటర్లు, ఇతర విమానాశ్రయాలు బ్యాగేజీ డెలివరీ సమయాన్ని తగ్గించుకోవాలని సూచించింది. 

ఇలా చేశారు..: దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల్లో దేశీయ విమానయాన సంస్థల్లో బ్యాగేజీ డెలివరీ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా జనవరిలో బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) చర్యలను ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. విమానం ల్యాండ్‌ అయిన 30 నిమిషాల్లోపే బ్యాగేజీ డెలివరీ జరగాలి. అందుకనుగుణంగా విమానయాన సంస్థలు తమ సామగ్రి, సేవల మరమ్మతులు, మెరుగు పరచడంతో పాటు పర్యవేక్షణనూ పెంచుకున్నాయి. 

ఈ స్థాయికి మెరుగైంది..: జనవరి 14న అంటే బీసీఏఎస్‌ చర్యలకు ముందు సరైన సమయంలో(అరగంటలోపే) బ్యాగేజీ అందుకునే ప్రయాణికుల సంఖ్య 62.2 శాతంగానే ఉండేది. బీసీఏఎస్‌ చర్యల అనంతరం, దేశీయ విమానయాన సంస్థలు తమ సేవలను మెరుగుపరచుకోవడంతో 2024 మార్చి నాటికి 90 శాతానికి పైగా ప్రయాణికులకు అరగంటలోపే బ్యాగేజీని అందించగలిగారు. 2024 మేలో ఇది 92.5 శాతానికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు