Bajaj Auto: బజాజ్ ఆటో లాభంలో స్వల్ప వృద్ధి.. సేల్స్‌లో ఆ రెండు బైక్‌లే టాప్‌

Bajaj Auto Q4 Results: బజాజ్‌ ఆటో క్యూ4 ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభాంలో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. 

Published : 25 Apr 2023 22:56 IST

ముంబయి: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో (Bajaj Auto) లాభం స్వల్పంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (Q4 Results) కంపెనీ స్టాండలోన్‌ పద్ధతిలో లాభం (పన్ను చెల్లింపుల అనంతరం- PAT) రూ.1,468.95 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ1432.88 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాలతో వచ్చే ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.8,905 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇది రూ.7,974.84 కోట్లుగా ఉంది.

సమీక్షా త్రైమాసికంలో దేశీయంగా వ్యాపారం పుంజుకుందని, గతేడాదితో పోలిస్తే 50 శాతం మేర వృద్ధి నమోదైనట్లు బజాజ్‌ ఆటో తెలిపింది. ఎబిట్టా సైతం 26 శాతం వృద్ధితో రూ.1,718 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. చివరి త్రైమాసిక అమ్మకాల్లో పల్సర్‌తో శ్రేణితో పాటు ప్లాటినా 110 ఏబీఎస్‌ విక్రయాలు వృద్ధికి దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారి లక్ష విక్రయాలు నమోదైనట్లు బజాజ్ ఆటో తెలిపింది. అదే సమయంలో స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయాలు తగ్గినట్లు బజాజ్‌ ఆటో తెలిపింది. ఇక 2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ 12 శాతం వృద్ధితో 5,627.60 కోట్ల PATని నమోదు చేసింది. ఆదాయం సైతం 10 శాతం పెరిగి రూ.36,428 కోట్లుగా నమోదైనట్లు బజాజ్ ఆటో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు