Bajaj Auto: మే నెలలో స్థిరంగా బజాజ్‌ ఆటో అమ్మకాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో అమ్మకాలు గతేడాదిలానే స్థిరంగా నమోదయ్యాయి.

Published : 03 Jun 2024 17:28 IST

దిల్లీ: పుణెకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో అమ్మకాలు 2024, మే నెలలో 3,55,323 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 3,55,148 యూనిట్లను కంపెనీ విక్రయించింది. ఈ మేరకు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2023 మే నెలలో విక్రయించిన 2,28,401 యూనిట్లతో పోలిస్తే, మొత్తం దేశీయ విక్రయాలు (వాణిజ్య వాహనాలతో సహా) గత నెలలో 1 శాతం క్షీణించి 2,25,087 యూనిట్లకు పడిపోయాయి. 2024 మే నెలలో ఎగుమతులు 3 శాతం పెరిగి 1,30,236 యూనిట్లకు చేరాయి. గతేడాది మే నెలలో విదేశీ మార్కెట్లకు 1,26,747 వాహనాలను ఎగుమతి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని