Bajaj Housing Finance IPO: రూ.7 వేల కోట్ల ఐపీఓకు బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Bajaj Housing Finance IPO: బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓకు సిద్ధమైంది. మార్కెట్ల నుంచి రూ.7వేల కోట్లు సమీకరించనుంది.

Published : 08 Jun 2024 15:59 IST

Bajaj Housing Finance IPO | దిల్లీ: బజాజ్‌ ఫైనాన్స్‌ అనుబంధ బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఐపీఓ (Bajaj Housing Finance IPO) కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. రూ.7,000 కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ఇందులో రూ.4 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజా షేర్లుగా జారీ చేయనుంది. బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ మాతృ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌కు చెందిన రూ.3 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు.

అప్పర్‌ లేయర్‌ కలిగిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు 2025 నాటికి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవ్వాలని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో బజాజ్‌ హౌసింగ్‌ ఐపీఓకు సిద్ధమవుతోంది. సమీకరించిన నిధులను భవిష్యత్తు మూలధన అవసరాలకు కంపెనీ వెచ్చించనుంది. ఇప్పటికే ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి.

బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నాన్‌ డిపాజిట్‌ టేకింగ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా రిజస్టర్‌ అయ్యింది. ఇళ్లు, కమర్షియల్‌ ప్రాపర్టీ ఆస్తుల కొనుగోలు, నిర్మాణానికి ఈ సంస్థ రుణాలను అందిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,731 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌, బోఫా సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ (ఇండియా) సెక్యూరిటీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్‌ ఈ పబ్లిక్‌ ఇష్యూకు బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని