Bank stocks: ఆర్‌బీఐ ఎఫెక్ట్‌.. బ్యాంక్‌, NBFC స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి

వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాల విషయంలో ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆయా రుణాల విషయంలో ఉన్న నిబంధనలు కఠినతరం చేయడమే ఇందుక్కారణం.

Updated : 17 Nov 2023 13:22 IST

Bank stocks | దిల్లీ: వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకున్న నిర్ణయం బ్యాంక్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌  స్టాక్స్‌పై పడింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఆయా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3.34%, యాక్సిస్‌ బ్యాంక్‌ 3%, కెనరా బ్యాంక్‌ 2.67%, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2.31%, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.39%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, 1.26, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.16, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 0.89% చొప్పున నష్టపోయాయి. బీఎస్‌ఈ బ్యాంకెక్స్‌ సూచీ 1.12 శాతం మేర కుంగింది.

ఇక నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలదీ ఇదే పరిస్థితి. ఎస్‌బీఐ కార్డ్స్‌ 6.70%, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 5%, అర్మన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 3.91%, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్షియల్‌ 3.78 శాతం చొప్పున నష్టపోయాయి. వ్యక్తిగత రుణాల విషయంలో ఆర్‌బీఐ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. హామీలేని వ్యక్తిగత రుణాలకు రిస్క్‌ వెయిట్‌ను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఈ సవరించిన నిబంధనలు గృహ, విద్య, వాహన రుణాలకు వర్తించవు. పసిడి, పసిడి ఆభరణాల తనఖాపై తీసుకునే రుణాలకూ వర్తించవని స్పష్టం చేసింది. 

సుబ్రతా రాయ్‌ మరణించినా.. సహారా కేసు కొనసాగుతుంది

క్రెడిట్‌ కార్డు రుణాల విషయంలోనూ.. రిస్క్‌ వెయిట్‌ను 25 పర్సెంటేజీ పాయింట్లు పెంచి ప్రస్తుత 125 శాతం నుంచి 150 శాతానికి చేర్చుతున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలు వినియోగదారు రుణాల విషయంలో విభాగాల వారీ పరిమితులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. అధిక రిస్క్‌ వెయిట్‌ ఉంటే.. బ్యాంకులు ఆయా హామీలేని వ్యక్తిగత రుణాల కోసం మరిన్ని నిధులను పక్కన పెట్టాల్సి వస్తుంది. సరళంగా చెప్పాలంటే.. అధిక రిస్క్‌ వెయిట్‌ కాస్తా బ్యాంకు రుణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆయా రుణాలపై రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆయా సంస్థలపై ప్రాఫిట్‌పై ప్రభావం పడే అవకాశం ఉండడమే ఇందుక్కారణంగా పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు