బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నికర లాభం రూ.4,775 కోట్లు

ప్రభుత్వ రంగ ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా’ తన 4వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Published : 16 May 2023 19:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మార్చితో ముగిసిన 4వ త్రైమాసికంలో 168% వృద్ధితో రూ.4,775 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. గత సవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.1,779 కోట్లు. త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 33.8% పెరిగి రూ.11,525 కోట్లుగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరం నికర వడ్డీ ఆదాయం 26.80% వృద్ధిని నమోదు చేసి రూ.41,355 కోట్లకు చేరుకుంది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏ జనవరి-మార్చి కాలంలో 3.79 శాతానికి తగ్గాయి. ఏడాది క్రితం 6.61 శాతంగా ఉంది. 27వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేరుకు రూ.5.50 డివిడెండ్‌ను బ్యాంకు సిఫార్సు చేసింది. 2023, జూన్‌ 30వ తేదీ నాటికి షేర్‌లను కలిగి ఉన్న వాటాదారులు డివిడెండ్‌కు అర్హులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని