Binny Bansal: ఫ్లిప్‌కార్ట్‌ బోర్డుకు బిన్నీ బన్సల్‌ గుడ్‌బై...!

Binny Bansal: ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. దీనికి విభేదాలే కారణమని తెలుస్తోంది.

Updated : 27 Jan 2024 18:00 IST

Binny Bansal | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ (Binny Bansal) ఆ  కంపెనీ నుంచి వైదొలిగారు. ఈ వారం ప్రారంభంలోనే ఆయన రాజీనామా విషయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ-కామర్స్‌ విభాగంలో ఆయన తీసుకొచ్చిన కొత్త వెంచర్‌ విషయంలో తలెత్తిన విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బిన్నీ బన్సల్‌ జనవరి 2న OppDoor పేరుతో కొత్త ఇ-కామర్స్ స్టార్టప్‌ను ఏర్పాటుచేశారు. వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చెందుతున్న ఇ- కామర్స్ బ్రాండ్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ సాయం చేస్తుంది. దీన్ని తీసుకొచ్చిన తర్వాత నెలకొన్న విభేదాల వల్ల ఫ్లిప్‌కార్ట్‌ బోర్డుకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కంపెనీలో తన వాటాను కూడా వాల్‌మార్ట్‌కు విక్రయించినట్లు సమాచారం. 2007లో బిన్నీ బన్సల్‌, సచిన్ బన్సల్‌ కలిసి బెంగళూరులో ఈ కంపెనీని స్థాపించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని