Swiggy: రంజాన్‌ నెలలోనూ బిర్యానీనే టాప్‌.. హైదరాబాద్‌లోనే ఆర్డర్లు అధికం

Swiggy: రంజాన్‌ మాసంలో ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది.

Published : 12 Apr 2024 00:12 IST

Swiggy | ఇంటర్నెట్‌డెస్క్‌: మన దేశంలో బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వారాంతాలు, పండగ రోజులు, ఐపీఎల్‌ సీజన్‌.. ఇలా సందర్భం ఏదైనా ఎక్కువమంది ఆసక్తి చూపే వంటకంలో బిర్యానీనే అగ్రస్థానంలో ఉంటుంది. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ నెలలోనూ ఈ వంటకం మరోసారి టాప్‌లో నిలిచింది. దేశవ్యాప్తంగా ఒక్క నెలలోనే 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. సాధారణ నెలలతో పోలిస్తే ఈ సంఖ్య 15 శాతం అధికమని పేర్కొంది. మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 8 వరకు వచ్చిన ఆర్డర్ల ఆధారంగా రూపొందించిన జాబితాను విడుదల చేసింది.

ఇది మాకో గుణపాఠం.. విమానాల రద్దుపై విస్తారా సీఈఓ

ఇందులో హైదరాబాద్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. రంజాన్‌ మాసంలో ఒక్క హైదరాబాద్‌ నుంచే 10 లక్షల ఆర్డర్లు అందుకున్నట్లు స్విగ్గీ తెలిపింది. 5.3 లక్షల హలీమ్‌ ప్లేట్లను డెలివరీ చేసినట్లు చెప్పింది. ఆర్డర్‌ చేసిన వాటిలో చికెన్‌ బిర్యానీ, హలీమ్‌, సమోసా అగ్రస్థానంలో నిలిచాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇఫ్తార్‌ సమయంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు 34 శాతం పెరిగినట్లు పేర్కొంది. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్‌ మాసంలో దేశవ్యాప్తంగా కొన్ని వంటకాలకు భారీ స్థాయిలో ఆర్డర్లు నమోదయ్యాయి. హలీమ్ 1454.88 శాతం, ఫిర్ని 80.97 శాతం, మాల్పువా 79.09 శాతం, ఫలూదా 57.93 శాతం, డేట్స్‌ 48.40 శాతం పెరిగాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని