Bitcoin: కొనసాగుతున్న క్రిప్టో ర్యాలీ.. బిట్‌కాయిన్‌ @ 71,000 డాలర్లు

Bitcoin: త్వరలో వడ్డీరేట్ల కోత, బిట్‌కాయిన్‌ ఈటీఎన్‌ల దరఖాస్తుకు లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అనుమతి వంటి కారణాలతో బిట్‌కాయిన్‌ విలువ రికార్డు గరిష్ఠానికి చేరింది.

Published : 11 Mar 2024 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ తొలిసారి 71,000 డాలర్ల మార్క్‌ను దాటింది. కాయిన్‌డెస్క్‌ వివరాల ప్రకారం సోమవారం ఓ దశలో 71,263.78 డాలర్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత 24 గంటల్లో దాదాపు 2.5 శాతానికి పైగా లాభపడింది. దీంతో బిట్‌కాయిన్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 1.40 లక్షల కోట్ల డాలర్లు దాటింది. 2024లో ఇప్పటి వరకు ఈ క్రిప్టో విలువ 67 శాతం మేర లాభపడడం విశేషం.

స్పాట్‌ బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లకు (Bitcoin ETFs) అమెరికా మార్కెట్‌ నియంత్రణా సంస్థలు ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ టోకెన్ విలువ పెరుగుతూ వస్తోంది. త్వరలో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే సంకేతాలు తాజా ర్యాలీకి దోహదం చేస్తున్నాయి. మరోవైపు బిట్‌కాయిన్‌, ఇథేరియం ‘ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ నోట్ల’కు దరఖాస్తులను స్వీకరించాలని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇది కూడా క్రిప్టోల దూకుడుకు కారణవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని