Stock Market Update: మదుపర్లకు ‘స్ట్రోక్‌’ మార్కెట్‌.. రూ.35 లక్షల కోట్లు ఆవిరి!

Stock Market Update: ఉదయం 12:17 గంటల సమయంలో సెన్సెక్స్‌ 5,059 పాయింట్లు నష్టపోయి రూ.71,408 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 1,523 పాయింట్లు కుంగి 21,740 దగ్గర ట్రేడవుతోంది.

Updated : 04 Jun 2024 12:35 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు అల్లకల్లోమవుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ దిగజారుతున్నాయి. ఉదయమే 2,000 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 5,000 పాయింట్ల వరకు కుంగింది. నిఫ్టీ సైతం దాదాపు 1,500 పాయింట్ల వరకు దిగజారడం గమనార్హం. దీంతో స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అత్యధిక ఒక్కరోజు నష్టం నమోదైంది. నిన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తెచ్చిన హుషారు ఈరోజు కొన్ని గంటల వ్యవధిలోనే ఆవిరవడం గమనార్హం. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ దాదాపు రూ.35 లక్షల కోట్లకు పైగా కుంగడం గమనార్హం.

ఉదయం 12:17 గంటల సమయంలో సెన్సెక్స్‌ 5,059 పాయింట్లు నష్టపోయి రూ.71,408 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 1,523 పాయింట్లు కుంగి 21,740 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్‌-30 సూచీలో ఒక్క హెచ్‌యూఎల్‌ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ 18%, పవర్‌ గ్రిడ్‌ 16%, ఎస్‌బీఐ 15%, ఎల్‌ అండ్‌ టీ 12%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 10%, టాటా స్టీల్‌ 9%, భారతీ ఎయిర్‌టెల్‌ 9%, టాట మోటార్స్‌ 9%, జేఎస్‌డబ్ల్యూ 8%, రిలయన్స్‌ 8% బజాజ్‌ ఫైనాన్స్‌ 8 శాతానికి పైగా కుంగాయి.

ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం.. ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కానీ, మెజారిటీ మార్క్‌ను దాటి ఎంత దూరంలో లేకపోవడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని