AI: ఏఐతో బీపీఓ ఉద్యోగులపై అధిక ప్రభావం: నాస్కామ్‌ ఛైర్మన్‌

AI: ఏఐ వల్ల పెద్ద మొత్తంలో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల మధ్య నాస్కామ్‌ ఛైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ రంగాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పారు.

Published : 03 Mar 2024 15:22 IST

ముంబయి: బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (BPO) రంగ ఉద్యోగులపై జనరేటివ్‌ కృత్రిమ మేధ (Gen AI) ప్రభావం అధికంగా ఉంటుందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ ఛైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ సేవల్లో పనిచేస్తున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీపీఓ ఉద్యోగాలను మాత్రమే ఏఐ వేగంగా భర్తీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

రోజువారీ విధుల్లో ఏఐని ఉపయోగించడం అలవాటు చేసుకోని వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని నంబియార్‌ స్పష్టం చేశారు. చాలా కంపెనీలు తమ సిబ్బందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన సాంకేతికతలన్నీ క్షేత్రస్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపాయని గుర్తుచేశారు. కానీ, జనరేటివ్‌ ఏఐ మాత్రం ఉన్నత స్థాయి ఉద్యోగాలపై అధిక ప్రభావం చూపుతుందని వివరించారు. రాబోయే 5-10 ఏళ్లలో జెన్‌ ఏఐ, ఏఐ వల్ల ఇప్పుడు ఊహిస్తున్న దానికంటే అధిక ప్రభావం ఉంటుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని