BSNL 5G: మరో 5-7 నెలల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ: టెలికాం మంత్రి

BSNL 5G: ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) 4జీ టెక్నాలజీని మరో 5-7 నెలల్లో 5జీకి నవీకరిస్తామని కేంద్ర టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

Updated : 09 Dec 2022 12:48 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ టెక్నాలజీని మరో 5-7 నెలల్లో 5జీకి (BSNL 5G) నవీకరిస్తామని కేంద్ర టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన 1.35 లక్షల టెలికాం టవర్లలో ఈ నవీకరణ ఉంటుందని అన్నారు. గురువారమిక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు. 

దేశీయంగా వినూత్నతను ప్రోత్సాహించేందుకు టెలికాం టెక్నాలజీ అభివృద్ధి నిధిని ఏడాదికి రూ.500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) స్థిరత్వం తీసుకొచ్చే కారకమని వైష్ణవ్‌ అన్నారు. దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1.35 లక్షల మొబైల్‌ టవర్లు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ప్రాతినిధ్యం ఉందని.. ఇతర టెలికాం సంస్థలు ఇప్పటికీ ఇక్కడ పట్టు సాధించలేదని తెలిపారు. 5జీ పరీక్షలకు పరికరాలను అందించాల్సిందిగా టీసీఎస్‌ను (TCS) బీఎస్‌ఎన్‌ఎల్‌ కోరింది. దీంతో 5జీ ప్రయోగాత్మక సేవలను కంపెనీ ప్రారంభించే అవకాశం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని