BSNL: కొత్త కనెక్షన్‌ తీసుకుంటే ఇన్‌స్టలేషన్‌ ఛార్జీలు ఉండవ్‌!

BSNL: కొత్త యూజర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ తీసుకునేవారికి ఇన్‌స్టలేషన్‌ ఛార్జీలను ఎత్తివేసింది. 

Published : 11 May 2023 18:46 IST

దిల్లీ: బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కనెక్షన్‌ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్‌స్టలేషన్‌ ఛార్జీ వసూలు చేయబోమని తెలిపింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) వివిధ రకాల ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. కాపర్‌ కనెక్షన్లతో పాటు ఫైబర్‌ ద్వారా కూడా ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చందాదారులను చేర్చుకోవడమే లక్ష్యంగా ఇన్‌స్టలేషన్‌ ఛార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించింది.

కాపర్‌ కనెక్షన్లపై రూ.250 ఇన్‌స్టలేషన్‌ ఛార్జీల కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ వసూలు చేస్తోంది. ‘భారత్‌ ఫైబర్‌’ కనెక్షన్లపై యూజర్లు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో యూజర్లు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. భారత్‌ ఫైబర్‌ ప్లాన్లు నెలకు రూ.329 నుంచి ప్రారంభమవుతున్నాయి.

రూ.329 ప్లాన్‌లో భాగంగా యూజర్లు 20 ఎంబీపీఎస్‌ వేగంతో 1 టీబీ డేటా పొందుతారు. పరిమితి ముగిసిన తర్వాత వేగం 4 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని యూజర్ల కోసం ప్రత్యేక హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లను ఇస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ రూరల్‌ హోం వైఫై ప్లాన్‌ కింద 30 ఎంబీపీఎస్‌ వేగంతో 1 టీబీ డేటా లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని