Google: గూగుల్‌కు సీసీఐ మరో షాక్‌.. ₹936 కోట్ల జరిమానా

సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌కు మరోసారి గట్టి షాక్‌ తగిలింది. గూగుల్‌ తన ప్లేస్టోర్‌ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) భారీ పెనాల్టీ విధించింది.

Published : 25 Oct 2022 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌కు మరోసారి గట్టి షాక్‌ తగిలింది. గూగుల్‌ తన ప్లేస్టోర్‌ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) భారీ పెనాల్టీ విధించింది. గూగుల్‌ మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ రూ.936.44 కోట్లు జరిమానా వేసింది. తన పద్ధతి మార్చుకోవాలని సూచించింది.

యాప్‌ డెవలపర్లు తమ యాప్‌.. యూజర్లకు చేరాలంటే యాప్‌స్టోర్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే,  దేశంలో వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో చాలా వరకు ఆండ్రాయిడ్‌వే. దీంతో యాప్‌ డెవలపర్లకు ప్లేస్టోర్‌ ఒక్కటే ఆధారంగా మారింది. ప్లేస్టోర్‌లో తమ యాప్‌ లిస్ట్‌చేయాలంటే గూగుల్‌ నియమాలను పాటించడంతో పాటు, గూగుల్ ప్లే బిల్లింగ్‌ సిస్టమ్‌ను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని గమనించిన సీసీఐ.. గూగుల్‌కు పెనాల్టీ విధించింది. వారం తిరగకముందే గూగుల్‌పై సీసీఐ విధించిన రెండో జరిమానా ఇది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందంటూ ఇటీవలే రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని