China: చైనా ఎగుమతులు 7.6% పెరిగాయ్‌

అమెరికా, ఐరోపాలతో వాణిజ్య ఉద్రిక్తతలున్నప్పటికీ, ఈ ఏడాది మే నెలలో చైనా ఎగుమతులు అంచనాలకు మించి నమోదయ్యాయి.

Updated : 08 Jun 2024 02:17 IST

హాంకాంగ్‌: అమెరికా, ఐరోపాలతో వాణిజ్య ఉద్రిక్తతలున్నప్పటికీ, ఈ ఏడాది మే నెలలో చైనా ఎగుమతులు అంచనాలకు మించి నమోదయ్యాయి. ఆ దేశ వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మేలో చైనా ఎగుమతులు 7.6% పెరిగి 302.35 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2023 ఏప్రిల్‌ తర్వాత ఇదే అత్యంత వేగవంత వృద్ధి. దిగుమతులు 1.8% పెరిగి 219.73 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. విశ్లేషకులు దిగుమతుల్లో 4% వృద్ధిని అంచనా వేశారు. ఎగుమతుల్లో బలమైన వృద్ధి కారణంగా చైనా వాణిజ్య మిగులు మేలో 82.62 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఏప్రిల్‌లో ఇది 72.35 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది మేలో ఎగుమతులు పెరిగినట్లు కనిపించడానికి కిందటేడాది ఇదే నెలలో ఎగుమతుల్లో వృద్ధి తక్కువగా నమోదుకావడం కూడా ఓ కారణమని చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా ఎగుమతులు 1.5%, దిగుమతులు 8.4% పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని