Google: గూగుల్‌పై కాంపిటీషన్ కమిషన్‌ విచారణకు ఆదేశం

ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ (CCI) విచారణకు ఆదేశించింది. ప్లేస్టోర్‌ ధరల విధానంలో పోటీ వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తుండడంపై ఈ ఆదేశాలు ఇచ్చింది. 

Published : 15 Mar 2024 19:17 IST

దిల్లీ: ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ (CCI) విచారణకు ఆదేశించింది. ప్లేస్టోర్‌ ధరల విధానంలో పోటీ వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తుండడంపై ఈ ఆదేశాలు ఇచ్చింది. గూగుల్‌ ప్లేస్టోర్‌ నవీకరించిన చెల్లింపుల విధానం పోటీ చట్టానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. దీనివల్ల యాప్‌ డెవలపర్లు, పేమెంట్ ప్రాసెసర్లు, వినియోగదారులపై ప్రభావం పడుతోందని పేర్కొంది. పోటీ చట్టంలోని సెక్షన్‌ 4ను గూగుల్‌ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించామని సీసీఐ పేర్కొంది. యాప్ డెవలపర్లకు ప్లేస్టోర్‌ ద్వారా అందిస్తున్న వివిధ రకాల సేవలకు గానూ సేవా రుసుములు వసూలుచేస్తున్నామని, ఈవిషయంలో గూగుల్‌ ఇచ్చిన సమాధానం సహేతుకంగా అనిపించడం లేదని సీసీఐ తన 21 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని