Divgi TorqTransfer IPO: ప్రారంభమైన దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!

Divgi TorqTransfer IPO: ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, టయోటా కిర్లోస్కర్‌ ఆటో పార్ట్స్‌ వంటి ప్రముఖ కంపెనీలు కస్టమర్లుగా ఉన్న దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ ఐపీఓ నేడు ప్రారంభమైంది.

Published : 01 Mar 2023 10:55 IST

దిల్లీ: వాహన పరికరాల తయారీ సంస్థ దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (Divgi TorqTransfer IPO) నేడు ప్రారంభమైంది. మార్చి 3న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.560- 590గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.412 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 2023 ఫిబ్రవరి 28నే బిడ్డింగ్‌ ప్రారంభమైంది.

ఈ ఐపీఓ (Divgi TorqTransfer IPO)లో రూ.180 కోట్ల విలువ చేసే తాజా షేర్లను జారీ చేయనున్నారు. మరో 39.34 లక్షల ఈక్విటీ షేర్లను కొంత మంది ఇన్వెస్టర్లు ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS)’ కింద విక్రయించనున్నారు. తయారీ కేంద్రాల్లోకి అవసరమయ్యే యంత్రాల కొనుగోలుతో పాటు ఇతర కార్పొరేట్‌ అవసరాలకు ఐపీఓ నిధులను వెచ్చించనున్నారు. ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో 75 శాతం అర్హతగల సంస్థాగత మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లు, 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. కనీసం 25 షేర్లకు బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఐపీఓ కీలక వివరాలు..

  • ప్రారంభ తేదీ: 2023 మార్చి 1
  • ముగింపు తేదీ: 2023 మార్చి 3
  • ధరల శ్రేణి: రూ.560- 590
  • ముఖ విలువ: ఒక్కో షేరు రూ.5
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సి షేర్ల సంఖ్య: 25 (ఒక లాట్‌)
  • బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ : 2023 మార్చి 9
  • రీఫండ్ల ప్రారంభం: 2023 మార్చి 10
  • డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ: 2023 మార్చి 13
  • లిస్టింగ్‌ తేదీ: 2023 మార్చి 14

కంపెనీ వివరాలు..

సిస్టమ్‌ లెవెల్‌ ట్రాన్స్‌ఫర్‌ కేస్‌, టార్క్‌ కప్లర్‌, డ్యుయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసి వాహన తయారీ సంస్థలకు దివ్‌గీ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి మూడు తయారీ, అసెంబ్లింగ్‌ కేంద్రాలున్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, టయోటా కిర్లోస్కర్‌ ఆటో పార్ట్స్‌ ఈ కంపెనీకి కస్టమర్లుగా ఉన్నాయి. ఇన్‌గా వెంచర్స్‌, ఈక్విరస్‌ క్యాపిటల్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.  కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదు కానున్నాయి.

ఆర్థిక వివరాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని