Indian Airlines: వారానికి 6% పెరగనున్న దేశీయ విమాన సర్వీసులు

వేసవి షెడ్యూల్‌లో భారతీయ విమానయాన సంస్థలు వారానికి 24,275 దేశీయ విమానాలను నడపనున్నాయని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) తెలిపింది.

Published : 21 Mar 2024 23:43 IST

మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే వేసవి షెడ్యూల్‌లో భారతీయ విమానయాన సంస్థలు దేశీయ విమానాలను దాదాపు 6% పెంచనున్నాయి. మొత్తం 24,275 వారపు దేశీయ విమానాలను నిర్వహిస్తాయి. ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ DGCA ప్రకారం, కొనసాగుతున్న శీతాకాల షెడ్యూల్‌లో 23,732 విమానాలు నడుస్తున్నాయి. 2024, వేసవి షెడ్యూల్‌ మార్చి 31 నుంచి అక్టోబర్‌ 26 వరకు ఉంటుంది. వేసవి షెడ్యూల్‌ ప్రకారం మార్చి 31 నుంచి 125 విమానాశ్రయాలకు వారానికి 24,275 విమానాలు బయలుదేరి వెళ్లనున్నట్లు DGCA తెలిపింది. 125 విమానాశ్రయాలలో అజంగఢ్‌, అలీఘర్‌, చిత్రకూట్‌, గోండియా, జల్గావ్‌, మొరాదాబాద్‌, పితోర్‌ఘర్‌ వంటి కొత్త విమానాశ్రయాలకు కూడా విమాన సర్వీసులు ఉంటాయని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) ఈ రోజు(గురువారం) ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు