DoT: ఆ కాల్‌ ఫార్వర్డింగ్‌లు ఆపండి.. టెలికాం ఆపరేటర్లకు డాట్‌ సూచన

DoT: యూఎస్‌ఎస్‌డీ కాల్‌ ఫార్వర్డింగ్‌లను డీయాక్టివేట్‌ చేయాలని టెలికాం ఆపరేటర్లకు కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ విభాగం సూచనలు జారీ చేసింది. 

Updated : 30 Mar 2024 13:32 IST

DoT | దిల్లీ: యూఎస్‌ఎస్‌డీ (USSD) కాల్‌ ఫార్వర్డింగ్‌లను ఏప్రిల్‌ 15 నుంచి డీయాక్టివేట్‌ చేయాలని టెలికాం ఆపరేటర్లకు టెలికాం విభాగం (DoT) సూచించింది. ఆ సేవలను రీయాక్టివేట్‌ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ పద్ధతులకు మళ్లాలని పేర్కొంది. ఐఎమ్‌ఈఐ (IMEI) నంబర్లు, మొబైల్‌ ఫోన్‌ బ్యాలెన్స్‌లను తనిఖీ చేసుకోవడానికి ఉపయోగించేదే ఈ అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీస్‌ డేటా ఆధారిత కాల్‌ ఫార్వర్డింగ్‌ సదుపాయం. *401# సేవలుగా వీటిని పిలుస్తుంటారు.

అయితే వీటిని కొందరు అసమంజస కార్యకలాపాలకు వినియోగిస్తుండడంతో డాట్‌ ఈ చర్యలకు దిగింది. యూఎస్‌ఎస్‌డీ ఆధారిత కాల్‌ ఫార్వర్డింగ్‌ సేవలున్న ప్రస్తుత వినియోగదారులు అందరూ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆ సేవలను రీయాక్టివేట్‌ చేసుకోవాలని డాట్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మొబైల్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు టెలికాం విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని