Stock Market: కౌంటింగ్ వేళ ఎరుపెక్కిన స్టాక్‌ మార్కెట్.. నెట్టింట మీమర్స్ హల్‌చల్‌

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్టాక్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ సూచీలు మరింత కుంగుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ నష్టాల బాట పట్టడంపై సోషల్‌ మీడియాలో మీమర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నారు.

Updated : 04 Jun 2024 15:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 350 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని.. విపక్ష ఇండియా కూటమి మాత్రం 150 సీట్లకు కాస్త అటూఇటూగా పరిమితం అవుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కానీ, ఎన్నికల ఫలితాల సరళి అంచనాలకు భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ ప్రకారం.. భాజపా మెజారిటీ మార్క్‌ను దాటినా, నిర్దేశించుకున్న లక్ష్యానికి మాత్రం చేరుకోలేకపోయింది. మరోవైపు.. విపక్ష కూటమి పుంజుకుని 200 స్థానాలను చేరుకునేందుకు దగ్గరగా ఉంది.

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నకొద్దీ దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. సూచీలు రికార్డు స్థాయిలో కుంగాయి. సమయం గడుస్తున్న కొద్దీ మరింత దిగజారుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్‌ మార్కెట్లు.. నేడు భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 2,000 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నం 2:45 గంటలకు బీఎస్‌ఈ 4,050.11 పాయింట్లు నష్టపోయి 72,366.17 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 1,234.00 పాయింట్లు కుంగి 22,029.90 దగ్గర ట్రేడవుతోంది. దీంతో రూ.లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది.

స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అత్యధిక నష్టం ఒక్క రోజులో నమోదైంది. దీంతో మదుపర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సాక్ట్‌ మార్కెట్‌ నష్టాలపై నెట్టింట మీమర్స్ హల్‌చల్‌ చేస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు