Elon Musk: ‘ఎక్స్‌’లో మరో మార్పు.. ‘బ్లాక్‌’ ఫీచర్‌కు మస్క్‌ గుడ్‌బై..!

Elon Musk: ఎక్స్‌ (ట్విటర్) ను సొంతం చేసుకున్నప్పటి నుంచి మస్క్‌ అందులో అనేక మార్పులు తీసుకొచ్చారు. అయితే కొత్తగా బ్లాక్‌ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో ఎక్స్ యూజర్లు మస్క్‌పై గుర్రుమంటున్నారు.

Updated : 19 Aug 2023 11:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఎక్స్‌’ (ఒకప్పటి ట్విటర్‌) అధినేత ఎలాన్‌మస్క్‌ (Elon Musk) తన యూజర్లకు మరో షాక్‌ ఇచ్చారు. ‘ఎక్స్‌’ ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్‌ చేసే ఫీచర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఆ ఆప్షన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. భద్రతా పరమైన ఫీచర్లలో ముఖ్యమైన బ్లాక్‌ ఫీచర్‌ను తొలగించటంతో యూజర్లు మస్క్‌పై గుర్రుమంటున్నారు. దీంతో ఆన్‌లైన్‌ వేధింపులు పెరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.

‘టెస్లా ఓనర్‌ సిలకాన్‌ వ్యాలీ’ పేరుతో ఉన్న ఓ యూజర్‌.. బ్లాక్‌ ఫీచర్‌ (block feature) గురించి అడిగిన ప్రశ్నలకు మస్క్‌ ఈ విధంగా బదులిచ్చారు. ‘ఎక్స్‌ ఫ్లాట్‌ఫాంలో బ్లాక్‌ ఫీచర్‌ని తొలగిస్తున్నాం. త్వరలోనే ఆ ఫీచర్‌ను డిలీట్‌ చేస్తాం. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే డైరెక్ట్‌గా మెసేజ్‌ చేసే వారిని మాత్రం బ్లాక్‌ చేయవచ్చు’ అని మస్క్‌ సమాధానం ఇచ్చారు. దీంతో ఇకపై ఎక్స్‌లో బ్లాక్‌ ఫీచర్‌ ఉండదు. దానికి బదులుగా మ్యూట్ ఫీచర్‌ని వినియోగించవచ్చు. మీరు ఏదైనా ఖాతాను మ్యూట్ చేస్తే ఆ ఖాతాదారు చేసే పోస్టుల్ని మనం వీక్షించకుండా ఉండేందుకు వీలుంటుంది. కానీ, మనం చేసే పోస్ట్‌లను మ్యూట్ చేసిన వ్యక్తి మాత్రం చూడవచ్చు, ఆ పోస్టులను తన ఫాలోవర్లకు రీపోస్ట్‌ చేయొచ్చు. అంతేగాక, డైరెక్ట్‌ మెసేజ్‌లు కూడా చేయవచ్చు. ఇలా డైరెక్ట్‌ మెసేజ్‌లు చేస్తే వాటిని బ్లాక్‌ చేసుకోవచ్చు.

రుణాలపై స్థిర వడ్డీ రేటు ఎంచుకోనివ్వండి

ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి అందులో అనేక మార్పులను తీసుకొచ్చారు మస్క్‌. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించటం దగ్గర నుంచి ట్విటర్‌ను ఎక్స్‌గా మార్చటం వరకూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు . ఇప్పుడు కొత్తగా బ్లాక్‌ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు తన అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని