Elon Musk: మస్క్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు.. స్పందించిన టెస్లా అధినేత

ఎలాన్‌ మస్క్‌ తరచుగా వివిధ పార్టీల్లో డ్రగ్స్‌ సేవిస్తున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

Updated : 08 Jan 2024 12:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్‌ (Elon Musk) తరచుగా డ్రగ్స్‌ తీసుకుంటారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. అనేకసార్లు పరీక్షలు చేయించుకున్నానని.. ఇప్పటి వరకూ తన శరీరంలో ఎలాంటి డ్రగ్స్‌ ఆనవాళ్లను గుర్తించలేదని తెలిపారు. అసలేం జరిగిందంటే..

ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో ఎలాన్‌ మస్క్ తరచుగా పాల్గొంటూ.. నిషేధిత డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని అమెరికాకు చెందిన వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ (WSJ) కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని అందులో పేర్కొంది. ఈ కథనాన్ని మస్క్‌ ఎక్స్‌ ఖాతాలో ట్యాగ్‌ చేస్తూ.. ‘‘గతంలో రోగన్‌తో ఒకసారి సేవించానని అంగీకరిస్తాను. నాసా అభ్యర్థన మేరకు మూడేళ్లుగా నేను  పరీక్షలు చేయించుకుంటున్నా. ఇప్పటి వరకు నా శరీరంలో డ్రగ్స్‌, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు గుర్తించలేదు’’ అని ట్వీట్ చేశారు.

2018లో అమెరికన్‌ పాడ్‌కాస్టర్‌ జో రోగన్‌ షోలో మస్క్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన గంజాయి పీల్చిన ఫొటో సామాజిక మాధమ్యాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పేస్‌ఎక్స్‌ సంస్థను నాసా లిఖిత పూర్వక వివరణ కోరింది. ఫెడరల్‌ చట్టాల ప్రకారం తమ సంస్థను డ్రగ్స్‌ రహిత కార్యాలయంగా నిర్వహిస్తామని హామీ ఇస్తూ స్పేస్‌ ఎక్స్‌ లేఖ రాసినట్లు వార్తలు వెలువడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని