Xmail: జీమెయిల్‌కు ప్రత్యామ్నాయం రానుందా? ఎలాన్‌ మస్క్‌ ఏమంటున్నారు?

ఎక్స్‌ మెయిల్‌ (XMail) ఎప్పుడు ప్రారంభం కానుందని ఆ సంస్థలోని (X) ఇంజినీరింగ్‌ అండ్‌ సెక్యూరిటీ బృందానికి చెందిన ఓ ఉద్యోగి ఎక్స్‌ వేదికగా ఇటీవల ప్రశ్నించారు.

Updated : 23 Feb 2024 22:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెబ్‌ సెర్చ్‌, ఈ-మెయిల్‌ విభాగాల్లో ప్రస్తుతం గూగుల్‌దే (Google) హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీ-మెయిల్‌కు (GMail) ప్రత్యామ్నాయం రానుందా? అంటే అవుననే అంటున్నారు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk). ఒకవేళ ఇదే నిజమైతే గూగుల్‌ అందిస్తోన్న ఈ-మెయిల్‌ సేవల మాదిరిగానే ఎక్స్‌ సంస్థ నుంచి ఇటువంటి సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఎక్స్‌మెయిల్‌ (XMail) ఎప్పుడు ప్రారంభం కానుంది? అని ఆ సంస్థలోని (X) ఇంజినీరింగ్‌ అండ్‌ సెక్యూరిటీ బృందానికి చెందిన నేట్‌ మెక్‌గ్రాడీ వ్యక్తి ఎక్స్‌ వేదికగా ఇటీవల ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఎలాన్‌ మస్క్‌.. ‘త్వరలో’ అంటూ సమాధానమిచ్చారు. దీనిపై యూజర్ల నుంచి పలురకాల కామెంట్లు వస్తున్నాయి. జీమెయిల్‌పై నమ్మకం పోయిందని, ఎక్స్‌మెయిల్‌కు మారే సమయం ఆసన్నమైందని ఓ యూజర్‌ పేర్కొన్నాడు. మరొకరు జంక్‌ మెయిల్స్‌ కోసం హాట్‌మెయిల్స్‌ ఎలా వాడుతున్నానో.. జీమెయిల్‌నూ అలాగే వినియోగిస్తానని పోస్టు చేశాడు.

ఈ ఏడాది చివరికి జీమెయిల్‌కు ‘గూగుల్‌’ ముగింపు పలకనుందని పేర్కొంటూ ఇటీవల ఓ సమాచారం (ట్విటర్‌లో) వైరల్‌గా మారింది. అయితే, దీన్ని ఖండించిన సంస్థ.. ‘జీ మెయిల్‌ సేవలు కొనసాగుతాయి’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇదిలాఉంటే, హెచ్‌టీఎంఎల్‌ వ్యూ (HTML view)ను 2024 నుంచి దశలవారీగా తొలగించనున్నట్లు జీమెయిల్‌ గతేడాది ప్రకటించింది. సరికొత్త వర్షన్‌లో స్టాండర్డ్‌ వ్యూ (Standard View)ను యూజర్లకు అందించనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని