Elon Musk : ఎలాన్‌ మస్క్‌ కొత్త ‘ఎక్స్‌’కు సరికొత్త చిక్కులు.. పోర్న్‌సైట్‌లా పేరుండటమే కారణం!

ఎలాన్‌ మస్క్ (Elon Musk) ట్విటర్‌ (Twitter) పేరు మార్పుతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పేరుతో ఇదివరకే ఓ పోర్న్‌సైట్‌ ఉండటమే అందుకు కారణం.

Published : 27 Jul 2023 19:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ట్విటర్‌ (Twitter) త్వరలో ఓ సూపర్‌ యాప్‌గా (Super app) రూపాంతరం చెందబోతోందని అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా దాని పేరును ‘ఎక్స్‌.కామ్‌’గా మార్చారు. లోగోలోని పిట్టను పక్కన పెట్టి ‘ఎక్స్‌’ చేర్చారు. అయితే ట్విటర్‌ పేరు మార్చడం వల్ల కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఇదివరకే ఈ పేరుతో ఓ పోర్న్‌సైట్‌ ఉండటంతో ఇండోనేసియాలో (Indonesia) దాన్ని నిషేధించారు. దాంతో ఈ డొమైన్‌ ఆ దేశంలో అందుబాటులో లేదు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇండోనేసియా కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేటిక్స్‌ అధికారులు ‘ఎక్స్‌’ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

ఎల్‌ఐసీ నుంచి కొత్త టర్మ్‌ ప్లాన్‌.. ప్రీమియం డబ్బులు వెనక్కి

‘ఇవాళ ఉదయం ట్విటర్‌ ప్రతినిధులతో మాట్లాడాం. ‘X.com’ డొమైన్‌ను ట్విటర్‌ ఉపయోగించనుందని వారు లేఖ పంపనున్నారని’ ఇండోనేసియా సమాచార ప్రసారశాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఉస్మాన్‌ కన్సోంగ్ వెల్లడించారు. పేరు మార్చడం వల్ల 2.4 కోట్ల మంది ఆ దేశంలో కొత్త సైట్‌ను యాక్సెస్‌ చేయలేరని ఓ నివేదిక పేర్కొంది. ట్విటర్‌ పేరు మార్పుపై పలువురు నెటిజన్లు ఇదివరకే స్పందించారు. పేరు మార్పు చాలా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని