Elon Musk: ఎక్స్‌లో హానికర కంటెంట్‌ పెరిగింది అందుకే..!

Elon Musk: ఎక్స్‌లో హానికర కంటెంట్‌ పెరగడానికి ఆస్ట్రేలియా నియంత్రణా సంస్థ ఓ ఆసక్తిక విషయాన్ని వెల్లడించింది.

Updated : 11 Jan 2024 09:06 IST

Elon Musk | కాన్‌బెర్రా: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (Social Media X) (గతంలో ట్విటర్‌)లో విద్వేష, హానికరమైన కంటెంట్ పెరగడానికి ఓ ఆసక్తికర కారణం ఉందని తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ‘ఈ-సేఫ్టీ కమిషన్‌’ తెలిపింది. కీలక విభాగం నుంచి ఉద్యోగులను తొలగించడం, నిషేధించిన ఖాతాలను పునరుద్ధరించడం వంటి చర్యలే ఇందుకు దోహదం చేశాయని పేర్కొంది.

ప్రస్తుతం ‘ఎక్స్‌’లో (Social Media X) పనిచేస్తున్న ఉద్యోగులు, వారు నిర్వర్తిస్తున్న బాధ్యతలకు సంబంధించిన వివరాలను సమీక్షించి ‘ఈ-సేఫ్టీ కమిషన్‌’ ఈ అభిప్రాయానికి వచ్చింది. ఇలా కంపెనీ ఉద్యోగుల సమాచారాన్ని బహిర్గతం చేయడం ఇదే తొలిసారని కమిషనర్‌ జూలీ గ్రాంట్‌ వెల్లడించారు. కంపెనీ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత.. ప్లాట్‌ఫామ్‌పై ‘విశ్వసనీయత, భద్రత’ వంటి అంశాలను పర్యవేక్షించే దాదాపు 1,213 మంది ఉద్యోగులు ‘ఎక్స్‌’ నుంచి బయటకు వెళ్లినట్లు కమిషన్‌ గుర్తించింది. ఈ సమాచారాన్ని స్వయంగా మస్క్‌ (Elon Musk) బృందమే తమకు అందించినట్లు వెల్లడించింది. వీరిలో దాదాపు 80 శాతం మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లేనని తెలిపింది. వీరంతా సామాజిక మాధ్యమంలోని సమాచార భద్రతపైనే ప్రధానంగా దృష్టి సారించేవారని పేర్కొంది. దీంతో హానికర కంటెంట్‌ వ్యాప్తిని నిలువరించే వ్యవస్థ ఎక్స్‌లో పూర్తిగా దెబ్బతిందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని