DGCA: విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ

విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది.

Published : 23 Apr 2024 14:26 IST

దిల్లీ: డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలచ్చింది. 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్‌ఆర్‌ నంబర్‌పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. విమానాల్లో కొన్నిసార్లు చిన్నారులకు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది.

విమాన సంస్థలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించింది. జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, మీల్స్‌/స్నాక్స్‌/ డ్రింక్స్‌, సంగీత వాయిద్య పరికరాల తీసుకెళ్లడానికి రుసుములు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఐచ్ఛికంగా ఉండాలని సూచించింది. తప్పనిసరి చేయకూడదని తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. సాధారణంగా విమానాల్లో వెబ్‌ చెక్‌- ఇన్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఆ సమయంలో నచ్చిన సీటును ప్రయాణికుడు ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఏ సీటూ ఎంచుకోకపోతే వారికి ఆటో సీట్‌ అసైన్‌మెంట్‌ నిబంధన వర్తిస్తుందని గుర్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని