యూపీఐ లైట్‌ను లాంచ్‌ చేసిన ఫెడరల్‌ బ్యాంక్‌

ఫెడరల్‌ బ్యాంకు చిన్న మొత్తాల డిజిటల్‌ లావాదేవీల కోసం యూపీఐ లైట్‌ను లాంచ్‌ చేసింది.

Published : 15 Nov 2023 19:44 IST

దిల్లీ: ప్రముఖ ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ భారత్‌లో తక్కువ విలువగల డిజిటల్‌ లావాదేవీలు చేసేవారికి వీలుగా యూపీఐ లైట్‌ను ప్రారంభించింది. చిన్న మొత్తాల చెల్లింపుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సిస్టమ్‌కు సంబంధించిన సరళీకృత వెర్షన్‌ ఎన్‌పీసీఐ యూపీఐ లైట్‌ను ప్రవేశపెట్టింది. ఫెడరల్‌ బ్యాంకు యూపీఐ లైట్‌, ఆన్‌-డివైజ్‌ వాలెట్‌ ఫీచర్‌ను ఇప్పటికే ఉన్న యూపీఐ యాప్‌ల్లోకి అనుసంధానిస్తుంది. వినియోగదారులు యూపీఐ పిన్‌ లేకుండా తక్కువ మొత్తం చెల్లింపులను చేయడానికి వీలు కల్పిస్తుంది.

కొత్త యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయకుండానే ఇప్పటికే ఉన్న యూపీఐ యాప్‌లోనే యూపీఐ లైట్‌ ఖాతాను తెరవొచ్చు. ఈ ప్రక్రియలో లాగిన్‌ చేశాక నిబంధనలు, షరతులను అంగీకరించిన తర్వాత, నగదు విలువను పేర్కొనాలి. లింక్‌ చేసిన బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి. యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి చెల్లింపును నిర్ధారించాలి. దీనిలో ఒక్కో లావాదేవీ పరిమితి రూ.500 వరకు, రోజుకు రూ.4 వేల వరకు వినియోగించవచ్చు. యూపీఐ లైట్‌ ఖాతాలో గరిష్ట బ్యాలెన్స్‌ పరిమితి రూ.2000. వినియోగదారులు ఫెడరల్‌ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయిన BHIM, Phonepe, Google Pay, Paytmలో యూపీఐ లైట్‌ ఫీచర్‌ను ఉపయోగించి లైట్‌ ఖాతాను తెరవొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు