Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో వెయ్యి మంది ఉద్యోగుల ఉద్వాసనకు రెడీ!

Flipkart layoffs: ఫ్లిప్‌కార్ట్‌లో వెయ్యి మంది ఉద్యోగులపై వేటు పడబోతోంది. పనితీరు ఆధారంగా నిర్వహించే సమీక్షలో భాగంగా వీరిని ఇంటికి పంపించనున్నట్లు తెలుస్తోంది.

Published : 25 Jan 2024 22:43 IST

Flipkart Layoffs | ఇంటర్నెట్‌ డెస్క్‌: వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) మరోసారి ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతోంది. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను ఇంటికి పంపనుంది. ఏటా నిర్వహించే ఉద్యోగుల పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా వీరికి ఉద్వాసన పలకనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని మనీ కంట్రోల్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

ప్రస్తుతం కంపెనీలో 22వేల మంది పనిచేస్తుండగా.. దాదాపు ఐదు శాతం మందిని ఇంటికి పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ తొలగింపులు చేపట్టడం ఇదేం తొలిసారి కాదు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పనితీరు ఆధారంగా ఉద్యోగుల తొలగింపులను ఏటా చేపడుతోంది. తాజా తొలగింపులూ అదే కోవలోకి రానున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి గతేడాదిగా నియామకాల ప్రక్రియనూ ఫ్లిప్‌కార్ట్ నిలిపివేసింది.

స్విగ్గీలో మరోసారి లేఆఫ్‌లు.. 400 మందిని తొలగించే యోచన..!

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి ఇటీవల ఉద్యోగులతో టౌన్‌హాల్‌ మీటింగ్‌ నిర్వహించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగైందని, ఈ ఏడాది చివరి నాటికి ఓ రూపు సంతరించుకోనుందని తెలిపారు. 2025లో ఫ్లిప్‌కార్ట్‌ ఐపీఓకు వచ్చే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్‌ గ్రాసరీ వ్యాపారం కూడా రాణిస్తోందని ఉద్యోగులకు సీఈఓ తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని