కస్టమ్స్‌, ఎక్సైజ్‌ డ్యూటీ తక్షణమే అమల్లోకి.. లోక్‌సభలో కేంద్రం బిల్లు

Nirmala sitharaman: బడ్జెట్‌లో ప్రతిపాదించే ఎక్సైజ్‌, కస్టమ్స్‌ సుంకాలు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్రం కొత్త బిల్లు తీసుకొస్తోంది.

Published : 13 Dec 2023 19:47 IST

Nirmala sitharaman | దిల్లీ: బడ్జెట్‌లో ప్రతిపాదించే ఎక్సైజ్‌, కస్టమ్స్‌ సుంకాలు తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి కొత్త బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఊహాజనిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ప్రొవిజినల్‌ కలెక్షన్‌ ఆఫ్‌ ట్యాక్సెస్‌ బిల్లు, 2023ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 

కేంద్రం తీసుకొస్తున్న బిల్లు ప్రకారం.. ఫిబ్రవరి 1 బడ్జెట్‌లో ప్రతిపాదించే ఆదాయ, కార్పొరేట్‌ పన్నులు ఏప్రిల్‌ 1 నుంచి లేదా నోటిఫై చేసిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అదే ఎక్సైజ్‌, కస్టమ్స్‌ సుంకాల్లో మార్పులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ది ప్రావిజనల్‌ కలెక్షన్‌ ఆఫ్‌ ట్యాక్సెస్‌ యాక్ట్‌, 1931 స్థానే ఈ కొత్త చట్టం రానుంది. కస్టమ్స్ లేదా ఎక్సైజ్ సుంకాల విధింపు, పెంపు తక్షణ అమలుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని