Nirmala Sitharaman: ప్రజల్లో ఆ స్పృహ కలిగితేనే సైబర్‌ దాడులను అడ్డుకోగలం: నిర్మలా సీతారామన్‌

ఫోన్‌లో సైబర్‌ నేరగాళ్లు చెప్పేది చేయకూడదనే స్పృహ ప్రజల్లో కలిగినప్పుడే సైబర్‌ నేరాలను కట్టడి చేయడం సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 

Published : 23 Nov 2023 16:48 IST

దిల్లీ: సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. ‘డేట్‌ విత్‌ టెక్‌’ (DATE with Tech) అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫోన్‌ కాల్‌, ఎస్సెమ్మెస్‌ ద్వారా జరిగే సైబర్‌ మోసాలను అడ్డుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆన్‌లైన్‌ భద్రత వ్యవస్థలను కేంద్రం, ఆర్‌బీఐ తరచుగా సమీక్షిస్తాయని తెలిపారు. బీమా కంపెనీలు కూడా ఈ పద్ధతిని పాటిస్తాయని చెప్పారు. 

‘‘ డిజిటల్‌ దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మనం కీలక దశలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్‌ నేరగాళ్లు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ.. ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నగదు దొంగిలిస్తున్నారు. దీనివల్ల ప్రజలతోపాటు, దేశ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉంది. సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నాం. ఫోన్‌లో సైబర్‌ నేరగాళ్లు చెప్పేది చేయకూడదనే స్పృహ ప్రజల్లో కలిగినప్పుడే వీటిని నియంత్రించడం సాధ్యమవుతుంది. ఇందుకోసం చాలా శ్రమించాలి. అయితే, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా సైబర్‌ మోసాలు జరిగే తీరు కూడా మారుతోంది. వీటిని అడ్డుకునే బాధ్యత ముందుగా తమపై ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి’’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

NPS విత్‌డ్రా కొత్త రూల్‌.. SLWతో క్రమం తప్పని ఆదాయం

పెద్ద సంస్థలు, వ్యవస్థాగతంగా సున్నితమైన సమాచారాన్ని భద్రపరిచే సంస్థలు పటిష్ఠమైన ఫైర్‌వాల్‌ వ్యవస్థను కలిగి ఉండాలని నిర్మలా సీతారామన్‌ సూచించారు. కాలానుగుణంగా  కంపెనీలు ఫైర్‌వాల్‌ వ్యవస్థలను సైబర్‌ దాడులను అడ్డుకునేలా అప్‌డేట్‌ చేయగలితేనే ప్రజల డేటా బహిర్గతం కాకుండా అడ్డుకోగలమని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని