Twitter: ట్విటర్‌ లోగో మార్పుపై ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్ల రియాక్షన్‌

ట్విటర్‌ (Twitter) లోగో మార్పుపై పలువురు చేసిన మీమ్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిలో కొన్ని సరదా మీమ్స్‌ (Memes)ను చూసి మీరు నవ్వుకోండి.

Updated : 24 Jul 2023 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాన్ మస్క్‌ (Elon Musk) తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనమే. ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటించడం నుంచి తాజాగా లోగో మార్చడం వరకు మస్క్‌ నిర్ణయాలు యూజర్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. 2006లో ప్రారంభమైన ట్విటర్‌ బ్లూ బర్డ్‌ ప్రయాణం నేటితో ముగిసింది. 17 ఏళ్లపాటు ట్విటర్‌ ఐకానిక్ సింబల్‌గా ఉన్న బ్లూ బర్డ్‌ నుంచి తొలగించి దాని స్థానంలో ‘ఎక్స్‌ ’(X) సింబల్‌ను ట్విటర్‌ లోగోగా తీసుకొచ్చారు. అలానే డొమైన్‌ నేమ్‌ కూడా ట్విటర్‌.కామ్‌కు బదులు.. ఎక్స్.కామ్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ట్విటర్‌లోగో, ఎలాన్‌ మస్క్, ట్విటర్‌ బర్డ్‌, రిప్‌ ట్విటర్‌ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ట్విటర్‌ లోగో మార్పుపై పలువురు చేసిన మీమ్స్ (Memes) నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిలో కొన్ని సరదా మీమ్స్‌ను చూసేయండి.













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని