Power Demand: గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లకు కేంద్రం ఆదేశాలు

మే 1 నుంచి జూన్ 30 వరకు ఉత్పత్తి జరుపుతూ ఉండాలని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Published : 13 Apr 2024 19:28 IST

దిల్లీ: ఈ వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పాదక ప్లాంట్లను మే 1 నుంచి జూన్‌ 30 వరకు ఉత్పత్తి జరుపుతూ ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ వేసవిలో గరిష్ఠంగా 260 గిగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 243 గిగావాట్ల ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే గ్యాస్‌ బేస్డ్‌ జనరేటింగ్‌ స్టేషన్ల (జీబీఎస్‌)ను వినియోగించుకోవాలనే నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ మే 1 నుంచి జూన్‌ 30 వరకు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా కోసం ఈ ఆర్డర్‌ చెల్లుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని