GDP: 2025లో జీడీపీ వృద్ధి 6.80%.. క్రిసిల్‌ అంచనా

వచ్చే ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (2025-2031) భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల మార్కును దాటి 7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది.

Published : 06 Mar 2024 18:31 IST

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-2025) 6.80% జీడీపీ వృద్ధి అంచనాతో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన అభివృద్ధిని సాధించనుంది. ఈ వృద్ధి పథం భారతదేశాన్ని 2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ స్థితికి చేరుస్తుంది. అలాగే, ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ బుధవారం తెలిపింది. దేశీయ సంస్కరణల మద్దతుతో ఎగువ మధ్యాదాయ వర్గానికి అధిక తలసరి ఆదాయాన్ని అందిస్తూ దేశం స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని నివేదిక అంచనా వేసింది.

క్రిసిల్‌కు సంబంధించిన ఇండియా అవుట్‌లుక్‌ నివేదిక ప్రకారం.. నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక పురోగతికి మద్దతు ఇవ్వనున్నాయి. భారత్‌ తన వృద్ధి అవకాశాలను అధిగమించి, 2031 నాటికి ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. 3.60 ట్రిలియన్‌ డాలర్ల పరిమాణంతో భారతదేశం ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీల తర్వాత ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని