GDP growth: జీడీపీ వృద్ధి 6.7శాతం!

గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది.

Published : 20 May 2024 01:42 IST

2023-24 జనవరి-మార్చిపై ఇండ్‌-రా అంచనా

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. అందువల్ల పూర్తి ఆర్థిక సంవత్సరానికి  (2023-24) వృద్ధిరేటు సుమారు 6.9-7 శాతం కావొచ్చని ఇండ్‌-రా ప్రధాన ఆర్థికవేత్త సునీల్‌ కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. మార్చి త్రైమాసిక, 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సర జీడీపీ తాత్కాలిక అంచనాలను  ప్రభుత్వం ఈ నెల 31న విడుదల చేయనున్న నేపథ్యంలో ఇండ్‌-రా ఈ విధంగా ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికాల వారీగా నమోదు చేసిన జీడీపీ గణాంకాలు పట్టికలో ఉన్నాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్‌ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో జీడీపీ వృద్ధి రేటు 2023-24లో 7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని