కార్యాలయ స్థలాలకు గిరాకీ పెరుగుతోంది

కొవిడ్‌ మహమ్మారి తర్వాత కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోందని, ఈ నేపథ్యంలో కార్యాలయాల స్థలాలకు గిరాకీ అధికంగా కనిపిస్తోందని స్కూటర్‌ సహ వ్యవస్థాపకుడు పునీత్‌ చంద్ర అన్నారు.

Updated : 03 Dec 2022 01:43 IST

స్కూటర్‌ సహ వ్యవస్థాపకుడు పునీత్‌ చంద్ర

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ మహమ్మారి తర్వాత కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోందని, ఈ నేపథ్యంలో కార్యాలయాల స్థలాలకు గిరాకీ అధికంగా కనిపిస్తోందని స్కూటర్‌ సహ వ్యవస్థాపకుడు పునీత్‌ చంద్ర అన్నారు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు హైబ్రిడ్‌ పని విధానాన్ని అనుమతిస్తున్నాయన్నారు. ఇవి సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే బదులుగా ‘మేనేజ్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌’కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఆరు నెలల కాలంలో ఈ స్థలాలకు నాలుగు రెట్లకు పైగా గిరాకీ పెరిగిందని వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలు ప్రీమియం మేనేజ్డ్‌ ఆఫీసులను ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో 5 లక్షల చదరపు అడుగుల కార్యాలయాల స్థలాన్ని స్కూటర్‌ అభివృద్ధి చేసినట్లు, దీనికోసం రూ.75 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టామని చెప్పారు. కొత్త ఆఫీసు స్థలాల కోసం వచ్చే ఏడాది కాలంలో మరో రూ.100 కోట్లను పెట్టుబడి పెట్టే ప్రతిపాదన ఉందన్నారు. బెంగళూరులో కొత్తగా మరో కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని