2022-23లో వృద్ధి రేటు 7%: ఫిచ్
భారత వృద్ధి రేటు అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగానే ఉంచుతున్నట్లు ఫిచ్ రేటింగ్స్ మంగళవారం వెల్లడించింది.
తదుపరి రెండేళ్లకు అంచనాల తగ్గింపు
దిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగానే ఉంచుతున్నట్లు ఫిచ్ రేటింగ్స్ మంగళవారం వెల్లడించింది. వర్ధమాన మార్కెట్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా నిలుస్తుందని తెలిపింది. అయితే తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023-24, 2024-25) భారత వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించింది. 2023-24లో భారత జీడీపీ వృద్ధి 6.2 శాతం, 2024-25లో 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. సెప్టెంబరు నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి, 2023-24లో 6.7 శాతం, 2024-25లో 7.1 శాతం వృద్ధిని అంచనా వేసింది.
2023లో విండ్‌ఫాల్ పన్ను ఉండకపోవచ్చు: చమురు సంస్థలు ఆర్జిస్తున్న అదాటు (విండ్‌ఫాల్) లాభాలపై ప్రభుత్వం విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను 2023లో పూర్తిగా తొలగించే అవకాశం ఉందని ఫిచ్ అంచనా వేసింది. చమురు ధరలు అంతర్జాతీయంగా గతంలో ఉన్న స్థాయికి చేరడంతో అదాటు లాభాల పన్ను ప్రస్తావన ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా, దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై అదాటు లాభాల పన్నును జులై 1 నుంచి కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ పన్నును సమీక్షించి మార్పులు చేస్తోంది. తాజాగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో 2023 నుంచి విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించకపోవచ్చని ఏపీఏసీ చమురు-గ్యాస్ అవుట్‌లుక్ 2023 నివేదికలో అంచనా వేసింది.
* దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు 15 శాతం దేశీయ అవసరాలను తీరుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Chandra Babu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల