Zomato: ‘10 నిమిషాల్లో డెలివరీ’ నిలిపివేత!: జొమాటో

ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే ఆహార పదార్థాలను సరఫరా చేసే ప్లాట్‌ఫామ్‌ జొమాటో, ఒక సేవను నిలిపి వేయనున్నట్లు సమాచారం.

Updated : 24 Jan 2023 08:32 IST

దిల్లీ: ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే ఆహార పదార్థాలను సరఫరా చేసే ప్లాట్‌ఫామ్‌ జొమాటో, ఒక సేవను నిలిపి వేయనున్నట్లు సమాచారం. ‘ఆర్డరు తీసుకున్న 10 నిమిషాల్లో ఆహార పదార్థాలు సరఫరా చేస్తామంటూ’ 2022 మార్చిలో జొమాటో ఇన్‌స్టంట్‌ ప్రకటించింది. ఇప్పుడీ సేవను నిలిపివేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రెస్టారెంటు భాగస్వాములకు కంపెనీ ఇటీవల సమాచారమిచ్చిందని అవి పేర్కొన్నాయి. కఠిన మార్కెట్‌ పరిస్థితుల్ని తట్టుకుని, లాభాదాయకత పెంచుకునేందుకే జొమాటో ఈ సేవలను ప్రారంభించింది. అయితే ఈ సేవలతో లాభదాయకత పెరగకపోగా, స్థిర వ్యయాలు చెల్లించేందుకు అవసరమైన పరిమాణంలో రోజువారీ ఆర్డర్లు కూడా లభించడం లేదని తెలుస్తోంది. అందుకే ఈ సేవలు నిలిపివేసి, ఆ స్థానంలో మరో కొత్త సేవను 7-10 రోజుల్లో ప్రవేశ పెట్టనున్నట్లు చెబుతున్నారు.  తక్కువ విలువ కలిగిన ప్యాక్డ్‌ మీల్స్‌ (థాలి, కాంబో మీల్స్‌) వంటి వాటిని సరఫరా చేసేందుకు సంస్థ ప్రయోగాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఇన్‌స్టంట్‌ సేవలు నిలిపివేయడం లేదని, రీబ్రాండింగ్‌ చేస్తున్నామని జొమాటో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని