డేటా ఛార్జీల పెరుగుదల ఆందోళనకరమే

డేటా ఛార్జీలు, స్మార్ట్‌ఫోన్‌ ధరల పెరుగుదల ఆందోళన కలిగించే అంశమని, డిజిటలీకరణ వేగానికి ఇవి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Published : 26 Jan 2023 02:22 IST

కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

దిల్లీ: డేటా ఛార్జీలు, స్మార్ట్‌ఫోన్‌ ధరల పెరుగుదల ఆందోళన కలిగించే అంశమని, డిజిటలీకరణ వేగానికి ఇవి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌, ప్రీపెయిడ్‌ కనీస రీఛార్జి మొత్తాన్ని రూ.155కు పెంచిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2025కు 120 కోట్ల మంది భారతీయులను ఆన్‌లైన్‌లోకి తీసుకు రావాలన్న లక్ష్యం ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య 83 కోట్లుగా ఉంది. అందువల్ల డేటా ఛార్జీల పెరుగుదలపై దృష్టి పెడతాం’ అని చంద్రశేఖర్‌ అన్నారు. ఇండియా స్టాక్‌ డెవలపర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఎయిర్‌టెల్‌ ఛార్జీల పెంపుపై ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదని, దీనిపై ట్రాయ్‌ జరిపే సమీక్ష కోసం చూస్తామని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ధరల పెరుగుదల ఉందని మంత్రి తెలిపారు. మార్చి కల్లా, మన యూపీఐ, ఆధార్‌ వంటి వ్యవస్థలను అందింపుచ్చుకునేందుకు 5-7 దేశాలు ముందుకు రావొచ్చని అంచనా వేశారు. వీటిలో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికా దేశాలు ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని