గూగుల్‌.. తలొగ్గింది

ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో, కావాల్సిన సెర్చ్‌ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు వినియోగదార్లను అనుమతించనున్నట్లు గూగుల్‌ పేర్కొంది.

Updated : 26 Jan 2023 06:48 IST

సెర్చ్‌ ఇంజిన్‌ ఎంపిక ఇక వినియోగదార్ల ఇష్టమే

దిల్లీ: ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో, కావాల్సిన సెర్చ్‌ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు వినియోగదార్లను అనుమతించనున్నట్లు గూగుల్‌ పేర్కొంది. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆదేశాలను అడ్డుకునేలా, కోర్టు ఆదేశాలను పొందడంలో గూగుల్‌ విఫలం కావడం ఇందుకు నేపథ్యం.  ఇక ఓరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్లు (ఓఈఎమ్‌) అంటే ఫోన్‌ తయారీదార్లు, తమ ఫోన్లలో గూగుల్‌ యాప్‌లను ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసేందుకు లైసెన్సులు ఇవ్వడానికి వీలుంటుంది. అలాగే ఆండ్రాయిడ్‌ కంపాటబులిటీని అప్‌డేట్‌ చేయనుంది. వినియోగదారులు కూడా తమ సెల్‌ఫోన్లను, తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా వాడుకునే వీలుంటుంది. ప్రస్తుతం గూగుల్‌కు చెందిన గూగుల్‌ మ్యాప్స్‌, యూట్యూబ్‌ లాంటి యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ చేసే సదుపాయం ఆండ్రాయిడ్‌ ఫోన్లలో లేదు. సాఫ్ట్‌వేర్‌లో మార్పుల తరవాత ఇందుకు వీలవుతుంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు గూగుల్‌పై సీసీఐ రూ.1337.76 కోట్ల అపరాధ రుసుమును విధించగా.. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి గత వారం సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దేశంలో 60 కోట్ల స్మార్ట్‌ఫోన్లలో 97 శాతం వరకు గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారానే నడుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని