వంట నూనెల ప్యాకెట్లపై ఉష్ణోగ్రతకు బదులు బరువు వివరాలు
వంట నూనెల ప్యాకెట్ల లేబుళ్లపై ‘ప్యాకింగ్ సమయంలో ఉన్న ఉష్ణోగ్రతకు బదులుగా నికర బరువు’ను ముద్రించేందుకు వంట నూనెల తయారీదార్లు, ప్యాకర్లు, దిగుమతిదార్లకు మరో 6 నెలల గడువును ప్రభుత్వం ఇచ్చింది.
మరో 6 నెలలు గడువిచ్చిన ప్రభుత్వం
దిల్లీ: వంట నూనెల ప్యాకెట్ల లేబుళ్లపై ‘ప్యాకింగ్ సమయంలో ఉన్న ఉష్ణోగ్రతకు బదులుగా నికర బరువు’ను ముద్రించేందుకు వంట నూనెల తయారీదార్లు, ప్యాకర్లు, దిగుమతిదార్లకు మరో 6 నెలల గడువును ప్రభుత్వం ఇచ్చింది. లేబుళ్లను సరిదిద్దేందుకు గతంలో ఇచ్చిన గడువు జనవరి 15తో ముగిసినందున, జులై 15 వరకు సమయం ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అనైతిక వ్యాపార విధానాలకు అడ్డుకట్ట వేసేందుకే వంట నూనెల ప్యాకింగ్ లేబుళ్లలో మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. మిగిలి ఉన్న ప్యాకేజింగ్ మెటీరియల్ అయిపోయే వరకు సమయం ఇవ్వాల్సిందిగా పరిశ్రమ ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని, గడువును ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ ఉష్ణోగ్రతల వద్ద వంట నూనెల బరువు ఒక్కోలా ఉంటుంది. సాధారణంగా వంట నూనెలను 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్యాకింగ్ చేయాలి. 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్యాక్ చేస్తే.. లీటరు నూనె బరువు 919 గ్రాములుగా ఉంటుంది. అదే 60 డిగ్రీల సెల్సియస్ వద్ద చేస్తే, నూనె బరువు 892.60 గ్రాములుగా ఉంటుంది. ఇప్పుడీ ఉష్ణోగ్రతలకు బదులుగా, ప్యాక్‌లో ఉన్న నికర పరిమాణం వివరాలనే కంపెనీలు ముద్రించాల్సి ఉంటుంది.
ప్యాక్‌పై పూర్తి వివరాల ముద్రణ తప్పనిసరి: ఒక విక్రయ ప్యాకెట్‌లో ఒకటికి మించి ప్యాకెట్‌లు లేదా ఏవేని కానుకలు (గిఫ్ట్‌లు) లాంటివి ఉన్నప్పుడు.. తప్పనిసరిగా తెలియజేయాల్సిన వివరాలన్నింటినీ ప్యాకెట్ పైన ముద్రించాలని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తయారీదారు, ప్యాకర్, దిగుమతి చేసుకుంటే దిగుమతిదారు పేరు, చిరునామా, ఏ దేశం నుంచి వచ్చింది, నికర పరిమాణం, తయారీ/ ప్యాకింగ్/ దిగుమతి నెల, సంవత్సరం, ఎప్పటివరకు వినియోగించాలో ఆ తేదీ వివరాలు, వినియోగదారు భద్రతకు సంబంధించిన వివరాల లాంటివి ప్యాకెట్ పైనా తప్పనిసరిగా ముద్రించాల్సిన వాటిల్లో ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఒక్కో యూనిట్ విక్రయ ధరను కూడా ముద్రించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Summons UK Official: లండన్‌లో ఖలిస్థాన్ అనుకూలవాదుల దుశ్చర్య.. బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు
-
India News
ఒక్క రోజే 1,071 కొవిడ్ కేసులు.. దేశంలో మళ్లీ పెరుగుదల
-
World News
28 ఏళ్లకే 9 మందికి జన్మ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
-
Politics News
కోటి మంది మహిళా లబ్ధిదారులతో సెల్ఫీ.. సాధినేని యామిని శర్మ
-
Ts-top-news News
వరి పొలంలో భారీ మొసలి
-
Movies News
రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి