జనవరిలో తయారీ నెమ్మదించింది

జనవరిలో దేశీయ తయారీ రంగ వృద్ధి నెమ్మదించింది. మొత్తం విక్రయాల్లో వృద్ధి తగ్గడం ఇందుకు కారణమైంది.

Published : 02 Feb 2023 03:18 IST

దిల్లీ: జనవరిలో దేశీయ తయారీ రంగ వృద్ధి నెమ్మదించింది. మొత్తం విక్రయాల్లో వృద్ధి తగ్గడం ఇందుకు కారణమైంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) 2022 డిసెంబరులో 57.8 పాయింట్లుగా ఉండగా.. 2023 జనవరిలో 55.4 పాయింట్లకు పరిమితమైంది. పీఎంఐ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లే. అయితే  డిసెంబరు కంటే జనవరిలో తక్కువగా నమోదైనందున, వృద్ధి నెమ్మదించినట్లుగా పరిగణించాలి.  వరుసగా 19 నెలలుగా సూచీ 50 పాయింట్ల ఎగువనే ఉంటూ వస్తోంది. ఇందువల్ల ఆర్థిక  పరిస్థితులు మెరుగైనట్లుగానే భావించవచ్చు. ‘వృద్ధి జోరు కొంత నెమ్మదించినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ముగింపునకు రావడంతో.. తయారీ రంగం వృద్ధిలోనే ఉంటుందని అనుకోవచ్చ’ని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరు పాలియానా డె లిమా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని