హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.7078 కోట్లు
డిసెంబరు త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ.7,077.91 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభంతో పోలిస్తే ఇది 14.74 శాతం ఎక్కువ.
ముంబయి: డిసెంబరు త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ.7,077.91 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభంతో పోలిస్తే ఇది 14.74 శాతం ఎక్కువ. అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కాబోతున్న హెచ్‌డీఎఫ్‌సీ లాభం స్టాండలోన్ ప్రాతిపదికన రూ.3,260.69 కోట్ల నుంచి రూ.3,690.80 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 13% పెరిగి రూ.4,840 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 3.5 శాతానికి చేరింది. నిర్వహణలోని ఆస్త్చు ప్రాతిపదికన మొత్తం రుణ పుస్తకం 13 శాతం వృద్ధి సాధించింది. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో, సంస్థ లాభదాయకత 15 శాతానికి పరిమితమైంద’ని హెచ్‌డీఎఫ్‌సీ వైస్ ఛైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ వెల్లడించారు. రెపోరేటును ఆర్‌బీఐ మరో 0.25 శాతం పెంచే అవకాశం ఉందని, అయినా కూడా ఇళ్లకు గిరాకీ బలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత రుణాల విభాగం 26% వృద్ధి చెందిందని, సరాసరి రుణ పరిమాణం రూ.35.7 లక్షలకు చేరిందన్నారు. సంస్థ వద్ద రుణాలు తీసుకున్న వారిలో రూ.18 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్నవారే 52 శాతమని పేర్కొన్నారు.
ఎన్‌పీఏలు తగ్గాయ్: స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2.32% నుంచి 1.49 శాతానికి తగ్గాయి. పునర్నిర్మాణం జరిగిన రుణాలు 1.4% నుంచి 0.7 శాతానికి పరిమితమయ్యాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.473 కోట్ల నుంచి రూ.393 కోట్లకు తగ్గాయి. 2022 డిసెంబరు 31 నాటికి కనీస మూలధన నిష్పత్తి 23.7 శాతంగా ఉంది.
ఎన్‌సీఎల్‌టీ నుంచి విలీన ఉత్తర్వులు రావొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం తర్వాత వ్యాపారం కొనసాగించడానికి అవసరమైన బహుళ నియంత్రణ వెసులుబాట్ల కోసం హెచ్‌డీఎఫ్‌సీ చేసిన దరఖాస్తుపై ఆర్‌బీఐ నుంచి ఇంకా బదులు రాలేదని మిస్త్రీ తెలిపారు. ప్రతిపాదిత విలీనంపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్